నవతెలంగాణ – రాయపోల్
కుటుంబ కలహాల వల్ల మహిళ అదృష్టమైన సంఘటన రాయపోల్ మండలం ఆరేపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.రాయపోల్ మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన బొమ్మ మేరమ్మ-బొమ్మ డానియల్ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వారం రోజుల క్రితం కాపురం విషయంలో భార్యాభర్తలు ఇద్దరు గొడవపడ్డారు. అది దృష్టిలో పెట్టుకొని బొమ్మ మేరమ్మ శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులందరూ తిని నిద్రించారు. అర్ధరాత్రి 1:00 గంటలకు భర్త దానియల్ లేచి చూసేసరికి మేరమ్మ ఇంట్లో లేదు. ఎవరికి తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల ఇళ్లల్లో బంధువుల ఇండ్లలో మేరమ్మ కోసం ఎంత వెతికిన ఆచూకీ లభించలేదు. ఆమె మొబైల్ నెంబర్ 9032410327 కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అనంతరం ఆమె ఆచూకీ కోసం రాయపోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మేరమ్మ సోదరుడు పుల్ల కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఎస్సై రఘుపతి తెలిపారు.