మిషన్‌ భగీరథ నీళ్లు వస్తలే…?

– సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సర్పంచులు, ప్రజాప్రతినిధులు
– ఎంపీపీ ఇంటికే భగీరథ నీరు అందని వైనం
– అధికారుల పనితిరుపై సర్పంచులు ఆగ్రహం
– సమావేశానికి హాజరుకాని అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు
నవతెలంగాణ-దోమ
ఆర్‌ డబ్ల్యూఎస్‌ అధికారుల పనితీరుపై పలువురు సర్పంచులు, జడ్పీటీసీ, ఎంపీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జరిగిన సమావేశం కొన్ని శాఖలపై వాడివేడిగా కొనసాగిం ది. బొంపల్లి అంగన్‌వాడి కార్యకర్త విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం వలన ఖాళీగా ఉండిపోయిందన్నా రు. విషయంపై అంగన్‌వాడి సూపర్‌వైజర్‌ పద్మ పని తీరు పై సర్పంచ్‌ కోళ్ల సురేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తగ్గకుండ చూడా లని ఎంఈఓ హరిచందర్‌కు ఎంపీపీ అనసూయ, దోమ ఎంపీటీసీ అనిత తెలిపారు. మైలారం తండాలో, శివ రెడ్డి పల్లిలో భగీరథ నీరు రాక ఏండ్లు గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని మైలారం సర్పంచ్‌ రాజు, ఎంపీపీ అనసూయ ఏఈ కాజా పని తీరుపై అగ్ర హం వ్యక్తం చేశారు. రెవిన్యూ అధికారులు వెంటనే స్పం దించి ఖాళీగా ఉన్న రేషన్‌ షాపుల నోటిఫికేషన్‌, సర్వేర్‌ను నియమించేందుకు ఉందని, అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జడ్పీటీసీ నాగిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జయరామ్‌, ఆయా శాఖల అధికారులు తదిత రులు పాల్గొన్నారు.