జుక్కల్ సెగ్మెంట్ పరిధిలోని మిషన్ భగీరథ 145 ఎంఎల్డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రధాన పిసిసిపి పైప్ లైన్ లీకేజ్ రావడం వలన అలాగే మరమ్మత్తుల నిర్వహణ కారణంగా మోటార్స్ నిలిపివేయడం జరుగుతుంది అని బాన్సువాడ డివిజన్ మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. కావున బాన్సువాడ, జుక్కల్, బోధన్, ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు బల్క్ నీటి సరఫరా లో నాలుగు రోజులు (22-01-2025-26-01-2025) అంతరాయం ఉంటుందని ఆమె తెలిపారు. కావున ప్రజలు సహకరించాలని ఆమే కోరారు. గ్రామాల్లోని ప్రజలు గ్రామపంచాయతీ బోర్ వాటర్ ను వాడుకోవాలని ఆమే తెలిపారు.