
నవతెలంగాణ – దంతాలపల్లి
మండలంలోని బీరీశెట్టిగుడెం గ్రామంలో గత కొన్ని రోజుల నుంచి మిషన్ భగీరథ పైపు పగిలిపోయి నీరు కాలుషితం అవుతుంది. అధికారులు పైప్ లైన్ ని సరిచేసి ప్రజల రోగాల బారిన పడకుండా చూడాలని గ్రామవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ప్రవాహం ఆగిపోయిన తర్వాత పైపులోకి మురికి నీరు వెళ్లి మరుసటి రోజు ఉదయం నీటి విడుదల కాగానే కొద్దిసేపటి వరకు మురికి నీరు వస్తున్నాయని దీనివల్ల డయేరియా వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు బుధవారం తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.