ఆదివాసీలకు మిషనరీ వితరణ..

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని చెన్నాపురంలోని 27 ఆదివాసి గిరిజన కుటుంబాలకు ఆంధ్ర ప్రదేశ్, ఏలూరు జిల్లా కోయిల గూడెం కేంద్రంగా పని చేస్తున్న లివింగ్ శాక్రిఫైస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ దేవ సహాయం ఆర్ధిక సౌజన్యంతో ఆదివారం సోలార్ లైట్లు పంపిణీ చేసారు. ఒక్కొక్క కుటుంబానికి ఒక సోలార్ కిట్టు, ఒక సోలార్ కిట్టు వెల రూ.3200లు వ్యయంతో అందజేసారు. ఒక కిట్టు లో రెండు ట్యూబ్ లైట్స్, నాలుగు విద్యుత్తు బల్బులు, ఫోన్ చార్జింగ్ కిట్టు, కరెంటుతో కూడా చార్జింగ్ చేసుకునే వీలుందని సంస్థ ప్రతినిధి జక్కుల రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో ఎల్ ఎస్ ఎం ట్రెజరర్ ప్రేమ కుమారి, వెస్లీ, తాటి సురేష్, క్రిష్, సువార్త రాజు, స్థానికులు పాల్గొన్నారు.