మీర్జాపూర్ సొసైటీపై అవిశ్వాసం 

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
నసురుల్లాబాద్ మండలం మిర్జాపూర్ సొసైటీ చైర్మన్ మారుతి పటేల్  పై అవిశ్వాసం పెట్టాలని 9 మంది పాలకవర్గ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు పాలకవర్గ సభ్యులు జిల్లా అధికారులను కలసి వినతిపత్రం అందజేసినట్లు సంఘం సభ్యులు తెలిపారు. మిర్జాపూర్ సొసైటీ సహకార సంఘం లో 13 మంది ఉండగా ఇందులో  బీఆర్ ఎస్ పార్టీకి చెందిన మారుతి పటేల్ చైర్మన్ అయ్యారు. ప్రస్తుతం ఇందులో 10 మంది సొసైటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ చేరి సంఘం అధ్యక్షుడు పై అవిశ్వాసం పెట్టాలని తీర్మానించారు. గతంలో 13 మంది సొసైటీ సభ్యులు బీఆర్ ఎస్ పార్టీ మద్దతు తో గెలవగా ఒకరు రాజీనామా చెయ్యగా. 12 మంది సభ్యుల్లో ప్రస్తుతం ఇందులో 9 మంది బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఏనుగు రవీందర్ రెడ్డి సమిక్షంలో చేరి ఇదే అదనుగా భావించిన సొసైటీ డైరెక్టర్లు ప్రత్యేక సమావేశమై అవిశ్వాస నోటీసు అందజేసినట్లు సమాచారం.