హెచ్‌సీఏ సామాగ్రి దుర్వినియోగం!

Misuse of HCA supplies!– ఉప్పల్‌ పీఎస్‌లో సీఈవో ఫిర్యాదు 
నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మరోసారి వార్తల్లో నిలిచింది. హెచ్‌సీఏ నిధులు, సామాగ్రి దుర్వినియోగం పట్ల ఉప్పల్‌ పోలీసు స్టేషన్‌లో సీఈవో సునీల్‌ ఫిర్యాదు చేశారు. జిమ్‌ పరికరాలు, ఫైర్‌ ఫైటింగ్‌ సామాగ్రి, క్రికెట్‌ బాల్స్‌, బకెట్‌ చైర్స్‌ దుర్వినియోగంపై నాలుగు వేర్వేరు ఫిర్యాదులు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే, సామాగ్రి దుర్వినియోగం, నిధుల అవకతకలు ఎప్పుడు చోటు చేసుకున్నాయనే అంశంలో స్పష్టత లేదు. నేడు హెచ్‌సీఏ ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించే అవకాశం ఉంది.