నవతెలంగాణ – డిచ్ పల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలో ఆర్డిటి స్టేడియం లో జూన్ 6 నుండి జూన్ 8 వరకు జరిగిన మినీ సబ్ జూనియర్ (అండర్-11) సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో రాష్ట్ర జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డిచ్ పల్లి మండలంలోని మిట్టపల్లి పాఠశాల విద్యార్థులు కిషోర్, శ్రీశాంత్ లు రజిత పతకాలు అందుకున్నారు. ఇద్దరు విద్యార్థులు పతకాలు సాధించడం పట్ల పలువురు వారిని అభినందించారు. రాబోవు రోజుల్లో మరింత మేరుగైన అట తిరును కనబర్చుతరని సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగమోహన్ ఆశ భవం వ్యక్తం చేశారు.