– హైదరాబాద్‌తో రంజీ పోరు
హైదరాబాద్: ఆఫ్ స్పిన్నర్ రోహిత్ రాయుడు (4/20) నాలుగు వికెట్ల మాయజాలంతో మిజోరం 199 పరుగులకే కుప్పకూలింది. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్‌లో గ్రూప్ దశ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ల ముందు మిజోరం తేలిపోయింది. 56 ఓవర్లలో 199 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. అగ్ని చోప్ర (43), కరియప్ప (45) రాణించటంతో మిజోరం మెరుగైన స్కోరు సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ కక్ (2/34) రెండు వికెట్లు కూల్చగా.. రవితేజ, సాంకెత్, తనరు త్యాగరాజన్ తలా ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 120/1తో ఆడుతోంది. ఓపెనర్ తన్మరు అగర్వాల్ (6) నిరాశపరిచినా.. రాహుల్ సింగ్ (81 నాటౌట్), రోహిత్ రాయుడు (25 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 79 పరుగుల వెనుకంజలో నిలిచింది.