అందరి సహకరంతో మహా జాతర విజయవంతం: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

– 3 లక్షలకు పైగా మంది భక్తుల రాక
నవతెలంగాణ – వేములవాడ
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి మహాశివరాత్రి జాతర అందరి సహకారం, సమన్వయంతో మహాశివరాత్రి జాతర విజయవంతమైoదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మహా శివరాత్రి జాతర విజయవంతమైన సందర్బంగా శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..అన్నిశాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడగలిగామని వివరించారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. రూ.4.5 కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పించిందన్నారు.
మంత్రి ప్రత్యేక చొరవ: జాతర విజయవంతం కు మార్గదర్శనం చేసిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తమకు అందుబాటులో ఉంటూ జాతర ఏర్పాట్ల పై పలు సూచనలు, సలహాలు అందజేశారని విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఉంటూ పర్యవేక్షణ  చేసిన స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులకు విప్ ధన్యవాదాలు తెలియజేశారు.
మీడియాకు ధన్యవాదాలు: మహా శివరాత్రి జాతర, దక్షిణ కాశీ గా ప్రసిద్ది చెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రాశస్త్యాన్ని మీడియా  ప్రపంచానికి చాటి చెప్పిందని విప్ కొనియాడారు. జాతరను విజయవంతం చేయడంలో సహకారం అందించిన మీడియా ప్రతినిధులకు విప్ కృతజ్ఞతలు తెలిపారు.
అన్ని శాఖల అధికారులు, సిబ్బంది: ఈనెల 7 వ తేదీన మహా శివరాత్రి జాతర ప్రారంభం కాగా, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది జాతర పనుల్లో కష్టపడి పనిచేశారని, భక్తులకు ఇబ్బంది లేకుండా తమ వంతు కృషి చేశారని విప్ వివరించారు. ఆర్టీసీ సంస్థ దాదాపు 400 బస్సులను కేటాయించి.. 3వేల ట్రిప్పులు నడిపిందని తెలిపారు. దాదాపు 3 లక్షలకు పైగా మంది భక్తులు తరలి వచ్చి రాజన్నను దర్శించుకున్నారని జాతర సందర్భంగా రాజన్న ఆలయ ఆర్జిత సేవల ద్వారా వచ్చిన ఆదాయం వివరాలు ఈ ఓ వెల్లడించారు. 07.03.24 రోజున రూ.24,22,392  8-3-2024రోజున రూ.74,06,600
ఆలయ ఈఓ కు సన్మానం: రాజన్న ఆలయంలో మూడు రోజులుగా నిర్వహించిన మహాశివరాత్రి జాతర విజయవంతం కావడానికి కృషి చేసిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, ఆలయ సిబ్బంది తో పాటుగా ప్రెస్ మీడియా మిత్రులకు ఆలయ ఈవో డి కృష్ణ ప్రసాద్  కృతజ్ఞతలు తెలిపారు. జాతర విజయవంతంగా నిర్వహించినందుకు గానూ  రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం నాయకులు శనివారం కార్యాలయంలో ఆలయ ఈఓ. డి కృష్ణ ప్రసాద్ ను కలసి అభినందనలు తెలిపి, శాలువాతో ఘనంగా సన్మానించి, ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సంకేపల్లి హరికిషన్ గౌరవాధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు నాగుల మహేష్ అరుణ్ ఎడ్ల శివ సాయి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ క్యాంపు పరిశీలన: రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రోటోకాల్ కార్యాలయం నందు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఆలయ ఉద్యోగులతో కలిసి ఈఓ కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. అనంతరం అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఎంత మంది భక్తులు మెడికల్ క్యాంపును ఉపయోగించుకున్నారని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు ,వీరి వెంట ఆలయ ఈ ఈ,రాజేష్,ఎలక్ట్రిక్  డి. శేఖర్ తదితరులు ఉన్నారు.