ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కి వినతి పత్రం అందజేత

నవతెలంగాణ- వలిగొండ రూరల్ :  మండలంలోని వెంకటాపురం కు చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి గ్రామంలో కుంటుపడిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే గ్రామాభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొత్త వెంకటేశం, రవీందర్ రెడ్డి, శ్రీశైలం, నరేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.