భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన బొజ్జ మంజులకి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఎల్ వో సి రూ.2,00,000 సహాయ నిధి మంజూరు కాగా, సంబంధిత ఎల్ ఓ సి చెక్కులు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆయన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసి చెక్కులు పేద ప్రజలకు ఎంతో గానో ఉపయోగపడుతున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం, గ్రామ శాఖ అధ్యక్షులు మచ్చ పాండు, రసాల బాల మల్లయ్య, బొజ్జ సాయిలు పాల్గొన్నారు.