నవతెలంగాణ -ఆర్మూర్
మండలంలోనిఅంకపూర్ ఎమ్మెల్యే నివాసంలో బుధవారం పట్టణంలోని సెంట్రింగ్ అసోసియేషన్ సభ్యులు,వెల్మల్ గ్రామ గంగపుత్ర సంఘం,అడవి మామిడిపల్లి వడ్డెర సంఘం, దేగం రజక సంఘం, చిన్నాయనం గంగపుత్ర సంఘం సభ్యులు తమ పూర్తి మద్దతు బిఆర్ఎస్ పార్టీకే అని తెలిపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించినారు. యాదగిరిగుట్ట తీర్థ యాత్రకు ఉచితంగా పంపిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా నిర్మించబడిన యాదగిరి పుణ్యక్షేత్రం దర్శనం కోసం స్వయంగా బస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు వన్నెల్ కె గ్రామం నుండి గ్రామస్థులు యాదగిరిగుట్ట దర్శనానికి ఉదయం సిద్ధులగుట్ట పై దర్శనం చేసుకున్న తర్వాత అల్పాహారం ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట కు పంపించడం జరిగింది. చరిత్రాత్మక కట్టడం శ్రీ యాదగిరి గుట్ట దైవ దర్శనానికి వెళ్లే భక్తులకోసం ఎమ్మెల్యే సొంత ఖర్చులతో బస్ ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది పట్టణ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉచితంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న డ్రైవింగ్ లైసెన్సు శిబిరాన్ని విచ్చేసి ఇదివరకే అప్లై చేసుకున్న యువతి యువకులకు లెర్నింగ్ లైసెన్సు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పస్కా నరసయ్య కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.