హ్యాండ్ బాల్ క్రీడాకారులకు ఎమ్మెల్యే సన్మానం 

నవతెలంగాణ-బెజ్జంకి
సీఎం కప్ హ్యాండ్ బాల్ క్రీడల్లో జిల్లా స్థాయిలో బెజ్జంకి మండల క్రీడాకారులు ద్వితీయ బహుమతి సాధించారు.గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద హ్యాండ్ బాల్ క్రీడాకారులను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శాలువా కప్పి సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి నిర్వహించిన సీఎం కప్ క్రీడలు సత్పలితాలిచ్చాయని జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ద్వితీయ బహుమతి సాధించడం అభినందనీయమని క్రీడాకారులను అభినందించారు. మండల బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు, ఇంచార్జీ ఎంపీడీఓ అంజయ్య,ఎంపీఓ విష్ణు వర్దన్, క్రీడాకారులు పాల్గొన్నారు.