అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నవతెలంగాణ – మోపాల్

మోపాల్ మండలంలోని బాడ్సి, మంచిప్ప గ్రామాలలో కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పగంగా రెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు  .అలాగే  బాడ్సి సొసైటీ పరిధిలోగల మంచిప్ప మరియు బాడ్సి గ్రామాలలో 250 మెట్రిక్ టన్నుల గోదాములకు  భూమి పూజ చేయడం జరిగింది. ఒక్క గోదాముకు 20 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల రైస్ మిల్లులో రెండు లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి లెక్కలు లేవని ఇదంతా రైస్ మిల్లర్స్ ఇష్టనుసారంగా ప్రభుత్వానికి లెక్కలు చూపించకుండా అక్రమంగా పంపారని దీనిపై ఎంక్వయిరీ నడుస్తుందని అలాగే, ఇంతకుముందు సొసైటీల ద్వారా రైస్ మిల్లులకి ధాన్యం తరలించినప్పుడు రైతుల నుండి  క్వింటాలుకు 10 కిలోల కర్త తీసారని, ఇలా తీయడం వల్ల రైతులు చాలా నష్టపోయారని ఇప్పుడు మన ప్రభుత్వంలో ఆ విధంగా జరగదని, రైతును రాజును చేయడమే మన ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు. అలాగే బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్ రెడ్డిని మరియు పాలకవర్గాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సొసైటీని లాభాల బాటలో నడిపిస్తూ రైతులకు కావాల్సిన ఎరువులు మరియు దాన్యం కొనుగోలు విషయంలో రైతులకు అనుక్షణం అండగా ఉండడం అనేది గొప్ప విషయమని ఆయన తెలిపారు. సొసైటీల ముఖ్య ఉద్దేశమే రైతులకు కావలసినవి అందించడమే అటువంటి విధిని సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు,  అలాగే బాడ్సి గ్రామంలో గల నూతనంగా ఏర్పాటు చేసిన శివాలయాన్ని కూడా సందర్శించి శివాలయాన్ని దర్శించుకున్నారు. తనకు కూడా శివుడంటే చాలా ఇష్టమని శివుడి దయవల్ల ఊరు పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ఆయన తెలిపారు. అలాగే ఈ మండలంలో చాలా పెద్ద నాయకులు ఉన్నారనీ ముప్ప గంగారెడ్డి లాంటి పెద్ద నాయకులు ఉన్నారని వారి కూడా ఇంకా రాజకీయంగా ఎదగాలని పెద్ద పదవులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే మోపాల్ మండలంలోని వడ్డెర కాలనీలో గ్రామపంచాయతీ భవనాన్ని కూడా సోమవారం రోజు ప్రారంభించడం జరిగింది. అలాగే మంచిప్ప గ్రామానికి ఎన్.ఆర్.ఇ.జి.ఎస్  నిధుల నుండి సిసి రోడ్డు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. నియోజకవర్గంలో 3000 ఇల్లు శాంక్షన్ అయ్యాయని అందులో ఎస్టిలకు కచ్చితంగా పెద్ద మొత్తంలో వారికి కేటాయించే విధంగా చూస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముప్పగంగా రెడ్డి మాట్లాడుతూ పోయిన తెరాస ప్రభుత్వం తప్పుడు ప్రొసీడింగ్ కాపీలను ఇచ్చి ప్రజలను మోసం చేశారని మన ప్రియతమ నాయకుడు డాక్టర్ భూపతి రెడ్డి మాత్రం అలా కాకుండా కచ్చితంగా సాధ్యమయ్యేవి చెప్తాడని చెప్పేది చేస్తాడని కచ్చితంగా మన మోపాల్ మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ఆయన తోడ్పాటు అందిస్తాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొపాల్ మండల అధ్యక్షుడు సాయి రెడ్డి, బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి, వెల్మ భాస్కర్ రెడ్డి, ప్రతాప్, ప్రవీణ్ రెడ్డి, సొసైటీ సీఈఓ నరసయ్య, శేఖర్ గౌడ్, సాయి కుమార్, అనిల్ రెడ్డి, పృద్వి, రఘు పటేల్, తాహాసిల్దార్ సోమేశ్వర్ ,ఎలక్ట్రిసిటీ ఏఈ బాబా శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.