బీసీ కుల గణనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

బీసీ కులగనణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శనివారం అన్నారు.  జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామంలో  శనివారం రోజున మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామ ఆలయం, శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఆరు పథకాలను అమలుపరుస్తుందని . కాంగ్రెస్ ప్రభుత్వం కులగనన కు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర  అందేలా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. గ్రామ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు  తెలిపారు. కార్యక్రమంలో మునిపల్లి సాయి రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు చిన్నారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు సొప్పరి వినోద్, శేఖర్ గౌడ్, పార్టీ కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.