
శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాన్ని బుధవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తో కలిసి బీహార్ రాష్ట్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సందర్శించారు. విద్యుత్ సరఫరా విధి, విధానాలను అడిగి తెలుసుకున్నారు. జల విద్యుత్ కేంద్రం కాంట్రాక్టు ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేపు అసెంబ్లీలో విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడుతానని తెలిపారు.