నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ-కొడంగల్‌
దౌల్తాబాద్‌ మండలం అంతారం గ్రామానికి చెందిన మాజీ విద్యార్థి ఉద్యమ నాయకుడు మెరుగు రవి కుమార్‌ సోదరుడి వివాహ వేడుకలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పెళ్లి జంట కలకాలం ఆయురారోగ్యా లతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు ప్రమోద్‌ రావు, బీఆర్‌ఎస్‌ కొడంగల్‌ మండల అధ్యక్షులు దామోదర్‌ రెడ్డి, కౌన్సిలర్‌ మధుసూ దన్‌ యాదవ్‌, సర్పంచ్‌ శ్రీకాంత్‌ రెడ్డి, నరోత్తం రెడ్డి, రామకష్ణారెడ్డి, సాయి రెడ్డి, కాశీం, నర్సప్ప, సున్నపు వెంకటప్ప, రాఘవేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.