
బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ఉదయం వేల్పూర్ మండలం అమీనాపూర్ సాయిబాబా ఫంక్షన్ హాలో బిఆర్ఎస్ నాయకులు దత్తాద్రి కూతురు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మధ్యాహ్నం ముప్కాల్ మణికంఠ ఫంక్షన్ హాల్ లో జలాల్ పూర్ బిఆర్ఎస్ నాయకులు జక్క నర్సారెడ్డి కూతురు వివాహ వేడుకకు హాజరయ్యారు. దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కమ్మర్ పల్లి మండల కేంద్ర శివారులోని లలిత గార్డెన్ లో బిఆర్ఎస్ సైనిక్ ఋగ్వేద్ చెల్లెలి వివాహ వేడుకల్లో పాల్గొని కొత్త దంపతులను ఆశీర్వదించారు. సాయంత్రం వేల్పూర్ మండలంలోని లక్కోర ఏఎన్ జి ఫంక్షన్ హాల్ లో జర్నలిస్ట్ రాజేందర్ చారి కుమారుని వివాహ రిసెప్షన్ కు హాజరై కొత్త జంటను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.