త్రిలింగ రామేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, కలెక్టర్

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామంలో గల త్రి లింగ రామేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు కామారెడ్డి జిల్లా కలెక్టర్ వి జితేష్ పాటిల్ ప్రత్యేక పూజలు. అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు మాట్లాడుతూ పురాతనమైన మహోత్తర శివాలయం దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.  శివాలయం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎల్లారెడ్డి ఆర్ డి ఓ ప్రభాకర్ ఉన్నారు.