చిన్నారులను అభినందించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని నటరాజ్ నృత్యానికేతన్, నాట్య గురువులు నారాయణ ,మృణాళిని ల ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యంలో మలేషియా దేశంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనపరిచినారు ..ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి నాట్యంలో ప్రతిభ కనపరిచిన సాయి శృతి , దేవాన్షి, తనవి, సుదీప్తి, దీక్షిత, మృదుల తదితరులను అభినందించినారు. ముందు ముందు తమ అత్యుత్తమ ప్రతిభతో మరింత ముందుకు దూసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరినారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు తదితరులు పాల్గొన్నారు..