అన్ని రకాలుగా గ్రామ అభివృద్ధికి సహకరిస్తా: ఎమ్మెల్యే

నవతెలంగాణ – డిచ్ పల్లి
గ్రామంలో ఏ సమస్య ఉన్న అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తూ గ్రామ అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి నీధులు మంజూరు చేస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. మంగళవారం డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి గ్రామంలో హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి లచ్చమొల్ల దత్తాద్రి తోపాటు ఇతరులు గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా తన దృష్టికి వచ్చిన వెంటనే నిధులను మంజూరు చేసే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు. పాఠశాలలో అత్యవసరంగా మరుగుదొడ్లు గ్రామస్తులు దృష్టికి తీగ ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే ఆయా పనులకు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రం, గ్రామాలు, పట్టణంలో ఉండే ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు ఆయన వివరించారు. అంతకుముందు ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సహకార సొసైటీ చైర్మన్ తరచంద్ నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ మాజీ ఐడిసిఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, యూత్ అధ్యక్షుడు నరేష్, గ్రామ ఉపాధ్యక్షుడు శేఖర్, సందీప్, నర్సగౌడ్, సీనియర్ నాయకులు కంచెట్టి గంగాధర్,హనుమాన్ సేవ సమితి సభ్యులు రాజ్ కుమార్, చిన్న రాజన్న, సచిన్, సుమన్, శక్కర్ల పెద్ద రాజన్న, రాజేష్,తో పాటు సభ్యులు గ్రామస్తులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.