తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు..

MLA's couple visited Tirumala Srivara..నవతెలంగాణ – ఆర్మూర్
ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం సతీమణితో కలిసి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు తీసుకున్నట్లు తెలిపారు. స్వామివారి దయతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నియోజక వర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా బిజెపి అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, నెహ్రూ యువ కేంద్రం జిల్లా అడ్వైజరీ కమిటీ మెంబర్ గు గులోత్ తిరుపతి నాయక్, పట్టణ అధ్యక్షులు మందుల బాలు, తదితరులు ఎమ్మెల్యే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.