నిజామాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో రాజారామ్ స్టేడియంలో నిర్వహించిన బాసర జోనల్ లెవెల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ 2024 శుక్రవారం నగరంలోని నాగారంలో రాజారాం స్టేడియం లో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కి వివిధ జిల్లాల నుండి విచ్చేసిన ఫారెస్ట్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన, పతక ఆవిష్కరణ చేసి కాగడ ప్రజ్వాలానతో స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించడం జరిగింది..ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు.. నిత్యం పర్యావరణ పరిరక్షణకై అడవులను కాపాడుతు వన్యమృగాలతో స్నేహం చేస్తూ అడవి జీవారసులను కాపాడుతున్న అటవీశాఖ అధికారులను అభినందిస్తూ విధినిర్వహణలో నిత్యం ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్న వారికీ క్రీడలు మానసిక ఉల్లాసన్ని ఇస్తాయి అన్నారు.
క్రీడాల వల్ల శారీరక, మానసిక దృఢత్వాన్ని పొందోచ్చాను అన్నారు. ఇందూర్ జిల్లా అంటేనే క్రీడాలకు పెట్టింది పేరని జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రానించిన నిక్కత్ జారినా, ఎండల సౌదర్య లాంటి క్రీడాకారులు ఉన్నారని గుర్తు చేశారు.ఇందూర్ జిల్లాలో స్పోర్ట్స్ ట్రాక్స్ నిర్మాణం, ఇండోర్ స్టేడియంల నిర్మాణం, మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు ఇవే అంశాలపై అసెంబ్లీలో ప్రస్థావించడం జరిగిందని ఇంచార్జ్ మంత్రి,ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు.తన పిరియడ్ లో తప్పకుండ పాత కలెక్టర్ గ్రౌండ్ లో ట్రాక్, ఇండోర్ స్పోర్ట్స్ నిర్మాణం మరియు రాజారామ్ గ్రౌండ్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. క్రీడాల్లో గెలుపు ఓటములు సహజం అని గెలిచిన వారు ఉన్నత శిఖరాలకు వెళ్లేలా ప్రయత్నించాలని ఓడిన వారు క్రుంగిపోకుండా గెలుపు దిశగా ప్రయత్నం చేయాలనీ సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీ. సి. శరవణన్ ఐఎఫ్ఎస్సి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బాసర సర్కిల్, బోగా నికిత ఐఎఫ్ఎస్ డిస్టిక్ District ఫారెస్ట్ ఆఫీసర్ నిజామాబాద్ ఇంచార్జ్, ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ ఐఎఫ్ఎస్సి జిల్లా అటవీ అధికారి, ఆదిలాబాద్, రవి ప్రసాద్ డిప్యూటీ సీఎఫ్ జిల్లా అటవీ అధికారి జగిత్యాల, ఎస్.ఎ. నాగిని బాను ఎస్ ఎఫ్ ఎస్ జిల్లా అటవీ అధికారి నిర్మల్ (ఎఫ్ ఎ స), రవీందర్ ఎస్ ఎఫ్ ఎస్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్, ఈ ఎస్ పి బాసర సర్కిల్ సుధాకర్ రావు, ఎస్ ఎఫ్ ఎస్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ నిజామాబాద్, భవానీ శంకర్ ఎస్ ఎఫ్ ఎస్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్, ఆర్మూర్, సంబంధిత ఫారెస్ట్ ఎఫ్ ఆర్ వో లు పద్మారావు, రవి మోహన్ బట్, సంజయ్ గౌడ్, లతోపాటు ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు సాయిరాం, నాలుగు జిల్లాల ఫారెస్ట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.