అంగన్వాడి సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తుతాను: ఎమ్మెల్యే ధన్ పాల్

Will raise Anganwadi issues in Assembly: MLA Dhan Pal– రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను తక్షణమే నెరవేర్చాలి
– అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి తగదు 
– రేక్కాడితే  తప్పా డొక్క నిండని స్థితిలో అంగన్వాడీలు, ఆయాలు 
– 40 సంవత్సరాల పాటు సమాజానికి, ప్రభుత్వానికి సేవ చేసినందుకు జీవో నెంబర్ 10 బహుమానం 
నవతెలంగాణ – కంఠేశ్వర్
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను తక్షణమే నెరవేర్చాలని అంగన్వాడీ ఇలా పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి తగదని రికార్డుతే తప్ప డొక్కాడని స్థితిలో అంగన్వాడీలు ఆయాలు ఉన్నారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడి సమస్యలపై అసెంబ్లీలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడతానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మేరకు సోమవారం  నిజామాబాద్ గాంధీ చౌక్ నుండి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. నినాదాలతో హోరెత్తింది. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వచ్చి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం స్వీకరించిన అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ మాట్లాడుతూ.. సీఐటీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న అంగన్వాడీల ధర్నా నిరంతరం సమస్యల పైన సీఐటీయూ పోరాడుతుంది. అంగన్వాడి సమస్యల పైన జూలై 24 నుండి జరుగుతున్న అసెంబ్లీలో  తాను లేవనెత్తుతాను హామీ ఇచ్చారు. అవసరమైతే అసెంబ్లీ ముందు మీ సమస్యలపై ధర్నా చేస్తాను అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులను 65 సంవత్సరాల పూర్తయిన వారికి అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తూ ఇంటికి పంపుతూ ఇచ్చిన జీవో 10ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి స్వర్ణ మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగుల సమస్యల తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు రాష్ట్రంలో 24 రోజులు నిరువధిక సమ్మె చేయడం జరిగిందని అన్నారు. ఆ సమ్మె సందర్భంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచుతామని, పెన్షన్ విఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. అనంతరం రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఐసిడిఎస్ మంత్రి సీతక్కకు ఉన్నతాధికారులకు పలుమార్లు దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం జీవో 10 ఇచ్చి తక్కువ బెనిఫిట్ తో బలవంతంగా రిటైర్మెంట్ చేస్తుంటే వ్యతిరేకించడం జరిగిందని దానిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా టీచర్లు హెల్పర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా జీవో 10ని అమలు చేయాలని సర్కులర్ జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఆమె అన్నారు. ఈ జీవో అమలు చేయడం వలన రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ తక్కువ బెనిఫిట్ ఇచ్చి అన్యాయంగా తొలగించడానికి వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు నాయకులు సూర్య కళ, రాజ్యలక్ష్మి, సరిత, జరిన ,లలిత, సునీత, సునంద, లక్ష్మీ, భాగ్య తదితరులు పాల్గొన్నారు.