
ప్రమాదవశాత్తు గుడిసెలు ఇల్లు దగ్ధమై కట్టుబట్టలతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు అండగా ఉంటామని ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎల్లవేళలా తోడుగా నీడగా ఉంటామని నిజామాబాద్ రూలర్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. మంగళవారం ఇందల్ వాయి మండలంలోని లోలం గ్రామంలో వేకువజామున షాట్ షార్క్యుట్ తో కాళీ బూడిదైన మనోధైర్యం కల్పించి బాధితులకు బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు సున్నం సత్తెమ్మ, సున్నం భూమయ్య, లకు చేరో పది వేల రూపాయల కందాల ప్రశాంత్ కు 5 వేల రూపాయలు ఎమ్మెల్యే స్వంతంగా అందజేశారు. ప్రమాదానికి గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద నిరుపేదల పక్షాన ఉంటుందని వారి కష్టసుఖాలు పాలు పంచుకుంటుందని అగ్ని ప్రమాదంలో కట్టుబట్టలతో బతికి బయటపడ్డ కుటుంబాలకు వెన్నంటే ఉంటామని త్వరలో వచ్చే ఇంద్రమ్మ గృహాలను మొదటి విడుదలని మంజూరు చేసి ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల చొప్పున అందజేయడం జరుగుతుందన్నారు ఇదే కాకుండా ప్రభుత్వపరంగా బాధితులకు 8 వేల రూపాయలు, 50 కిలోల బియ్యంను అందజేస్తామన్నారు. ఇదే కాకుండా ఒక నెలకు సరిపడా పప్పు ,ఉప్పు, నూనె, బియ్యం ను తన వంతుగా అందజేస్తామన్నారు.కాంగ్రెస్ సినియర్ నాయకులు గుట్ట గంగాధర్ ఎమ్మెల్యే దృష్టికి బాధితుల సమస్యలను తీసుకొని వచ్చారు ప్రతి నాయకుడు కార్యకర్త ఇలాంటి వారికి ఆదుకుంటారని ఇలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి ప్రవీణ్ గౌడ్ డి సి సి డెలిగేట్లు సుధాకర్, వెంకట్ రెడ్డి, మహిపాల్ నాయక్, బైరన్న, ఆశిష్, కోర్స మోహన్, శేఖర్, లక్ష్మణ్, గడ్డం దాస్, రవి, ఎశాల రాములు, పోలసాని శ్రీనివాస్, దశరథ్, తహసిల్దార్ వెంకట్రావు తోపాటు గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.