ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ప్రచార రథాన్ని ప్రారంభించిన నాయకులు

నవతెలంగాణ- తుంగతుర్తి: మండల కేంద్రంలోని ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథాన్ని గురువారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎమ్మెల్యే కిశోర్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, పులుసు వెంకటనారాయణ గౌడ్, గోపగాని శ్రీనివాస్ గౌడ్, గోపగాని రమేష్ గౌడ్, పూసపెల్లి శ్రీనివాస్, గునిగంటి సంతోష్ గౌడ్, తడకమల్ల రవికుమార్, ఎల్లబోయిన బిక్షం, గోపగాని వెంకన్న, నాయకులు పాల్గొన్నారు.