నవతెలంగాణ – నెల్లికుదురు
మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య అమృనాయక్ మంత్రివర్గంలో చోటు కల్పించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని తొరూరు వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ జిలకర యాదాద్రి కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ ఉండి వెనుకబడిన ప్రాంతంగా ఉందని ఈ ప్రాంత అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అని తెలిపారు. వెనుకబడిన ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. మహబూబాద్ నియోజకవర్గ అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం అండ దండలు మంత్రి పదవి ఇస్తే తప్ప వేరే గత్యంత లేదని అన్నారు. మంత్రి పదవి ఇవ్వడానికి పార్టీ అధినేతలు నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టి మా ప్రాంతాన్ని కాపాడాలని కోరినట్ల తెలిపారు. దీనికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ప్రభుత్వ సలహాదారులు ముఖ్యమంత్రి వద్ద తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు.