పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామ మాజీ సర్పంచ్ జంగి రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ అకస్మాత్ గా చనిపోవడం జరిగింది. విషయాని తెలుసుకొని వారి నివాసానికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మనో ధైర్యం కల్పించి అండగా ఉంటానని అన్నారు. తాడూరి గ్రామానికి సర్పంచిగా కొన్ని ఏళ్లుగా కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, తిప్పర్తి నరసింహారెడ్డి, నాయకులు గ్రామ పెద్దలు కార్యకర్తలు పాల్గొన్నారు.