నవతెలంగాణ – అచ్చంపేట
మునిసిపాలిటీ పరిధిలో నివాసం ఉంటున్న ప్రజల ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సోమవారం మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని పట్టణంలోని డ్రైనేజ్ కాలువల, మురుగునీరు రోడ్లపై పారకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, తాగునీరు కలుషితం కాకుండా, విద్యుత్తు సరఫరాలో అంతరాయం, రహదారులపై నీరు నిలవడం, రోడ్లపై గుంతలు, మ్యాన్‌హోళ్ల మరమ్మతులు, డ్రైనేజ్ పూడికతీత, ఇతరత్రా సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మునిసిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, కమిషనర్ శ్యాంసుందర్, కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.