ఐకేపీ వివో ఏలను ప్రభుత్వం ఆదుకుంటుంది: ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ 

నవతెలంగాణ – అచ్చంపేట 
ఐకేపీ (ఇందిరా క్రాంతి పథకం) లో పనిచేస్తున్న వివో ఏ లను ప్రభుత్వం ఆదుకుంటుందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం అమ్రాబాద్, పదర మండలాల తెలంగాణ ఐకెపి వివో ఏ  ఎంప్లాయిస్ అసోసియేషన్ స్వాతంత్ర యూనియన్  ఆధ్వర్యంలో డిండి గెస్ట్ హౌస్ లో  ఎమ్మెల్యేకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ వివో ఏల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చరు. మహిళా సంఘాలకు ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ రుణ సౌకర్యాలను మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలని వివో ఏ లకు సూచించారు. శ్రీనిధి ద్వారా రుణాలు తీసుకున్న మహిళ సభ్యురాలు క్రమం తప్పకుండా అప్పులు చెల్లించే విధంగా చూడాలని సూచించారు. మహిళా సంఘాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరిన్ని అవకాశాలను కల్పించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల వివో ఏ లు పాల్గొన్నారు.