మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

నవతెలంగాణ – నూతనకల్
ఇటీవల మండల కేంద్రానికి చెందిన సాబాది వెంకట్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. శనివారం తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామేల్ పంపించిన రూ.50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని  కాంగ్రెస్ మండల నాయకులు చురకంటి చంద్ర రెడ్డి మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పన్నాల మల్లారెడ్డి బద్దం వెంకటరెడ్డి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.