మండలంలోని ఊకోండి గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బంది గురవుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే బీటీ రోడ్ల మంజూరుకు కృషి చేయగా శుక్రవారం ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఫ్లెక్స్ కి పాలభిషేకం చేశారు . ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మేడి నాగలక్ష్మి యాదయ్య మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు. ఊకోండి గ్రామం నుండి తాళ్ల వెల్లంల రోడ్డు వరకు, పులిపలుపుల నుండి ఊకోండి ఎక్స్ రోడ్డు వరకు బీటీ రోడ్డు మంజూరు చేయించేందుకు కృషిచేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు నడుంపల్లి యాదగిరి, నిమ్మల స్వామి , మాజీ ఉప సర్పంచ్ ఎర్రమధ వెంకన్న , మాధగోని దేవలోకం , స్వామి , మాధగోని రుషి గౌడ్ , భీమగోని ముత్యాలు , బోయపల్లి యాదయ్య , బోయపల్లి వెంకన్న , బోయపల్లి శంకర్ , దొడ్డి నాగరాజు , జాల అంజయ్య , కొయ్యడి మధు తదితరులు ఉన్నారు.