
తిరుమలగిరి పట్టణంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో గాదరి కిషోర్ కుమార్ గెలుపే లక్ష్యంగా పొలిటికల్ యూత్ ఐకాన్ కందుకూరి ప్రవీణ్ నిర్మించిన చింత నరేష్ రచనతో యాట సంధ్య గానంతో రాసిన ఎన్నికల సమర గీతం పాటల సీడిని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుజ్జ యుగేందర్రావు, తిరుమలగిరి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, జడ్పిటిసి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొమ్మినేని స్రవంతి సతీష్ కుమార్, సూర్యాపేట జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు కందుకూరి లక్ష్మయ్య, మండల గ్రంథాలయ చైర్మన్ మోడెపు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.