
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఖిల్లా చౌరస్తా లో గ్రామ దేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..నిజామాబాద్ నగర ప్రజలకు ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.మత సామరస్యానికి ప్రతీక ఊర పండుగ.నిజామాబాద్ నగర ప్రజలు ఐక్యతకు నిదర్శనమైన ఊర పండుగను నగర ప్రజలు ఘనంగా జరుపుకోవాలి. దుష్ట శక్తులు,అంటు వ్యాధులు ప్రభాలకుండా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి నిజామాబాద్ నగర ప్రజలు సుఖ శాంతులతో,ఆయుఆరోగ్యలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ బి ఆర్ ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, సిర్ప రాజు కార్పొరేటర్ లు నాయకులు పాల్గొన్నారు.