రైతులతో కలిసి మంత్రి తుమ్మలను కలిసిన ఎమ్మెల్యే తోట ..

MLA Thota who met the minister along with the farmers.నవతెలంగాణ-  మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో గత కొద్ది రోజుల నుండి సోయా కొనుగోలు కేంద్రం మూతపడటంతో సుమారు ఎనిమిది వేల క్వింటాళ్ల సోయాబీన్ కొనుగోలు జరగకుండా మిగిలిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతుండగా.. సోమవారం రాత్రి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  వ్యవసాయ శాఖ మంత్రివర్యులు  తుమ్మల నాగేశ్వర రావు దగ్గరికి రైతులను తీసుకెళ్లి పరిస్థితి వివరించారు. ఈ సమస్యపై మంత్రి తుమ్మల స్పందిస్తూ.. మిగిలిపోయిన సోయా పంటను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని రైతులకు భరోసా ఇచ్చారు. సమస్యను తన  దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి రైతులకు అండగా నిలబడిన ఎమ్మెల్యే  గారికి నియోజకవర్గ రైతులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.