బోనపల్లి జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎస్ఆర్ 

నవతెలంగాణ – శాయంపేట
మండలంలోని ప్రగతిసింగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోనపల్లి రఘుపతి రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సమక్షంలో జరిగాయి. ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ రఘుపతి రెడ్డి దంపతులను శాలువాతో సత్కరించి పుష్పపుచం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రఘుపతి రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కటంగూరి రామ్ నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి, ఎంపిటిసి బాసాని చంద్రప్రకాష్, పరకాల ఏఎంసీ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పిటిసి చల్లా చక్రపాణి,  నాయకులు దుబాసి కృష్ణమూర్తి పాల్గొన్నారు.