ఎమ్మెల్యే హనుమంత్ సిండే మంచి చేయకపోయినా చెడు చెయ్యని వ్యక్తి

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన సుల్తాన్,
నవతెలంగాణ- మద్నూర్: జుక్కల్ ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలుగా కొనసాగిన హనుమంతుసిండే షిండే మంచి చేయకపోయినా ఎవరికి చెడు చెయ్యడనీ ఆయన వ్యక్తిత్వం చాలా మంచిదని కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే హనుమంత్  సీండే సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన అనంతరం సుల్తాన్ మాట్లాడుతూ తెలిపారు ఎమ్మెల్యే మంచితనం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు సుల్తాన్ కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకునిగా విధులు నిర్వహించాడు అతను గురువారం నాడు ఎమ్మెల్యే షిండే సమక్షంలో పార్టీలో చేరడంతో సుల్తాన్ కు బీఆర్‌ఎస్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు ఆయన చేరిక కార్యక్రమంలో బిచ్కుంద అసత్ అలీ మద్నూర్ మండల మోహిన్ పటేల్ షేక్ గఫర్ మమ్మద్ పటేల్ తదితరులతోపాటు మండల బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ మద్నూర్ సర్పంచ్ సురేష్ పాల్గొన్నారు