జుక్కల్ నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే దీపావళి శుభాకాంక్షలు

– ఎమ్మెల్యే ఇంట్లో ఘనంగా దీపావళి పండుగ

నవతెలంగాణ మద్నూర్
జుక్కల్ నియోజకవర్గం ప్రజలందరికీ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం దీపావళి పండుగను ఎమ్మెల్యే ఇంట్లో కుటుంబ సమేతంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ దీపావళి పండుగను ఘనంగా ఉత్సవంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మి దేవత వెలుగులు నింపాలని ఆ భగవంతునితో కోరుకున్నారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే దీపావళి పండుగ ఘనంగా ఉత్సవంగా జరుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.