పాల్వంచ మండల కేంద్రంలో పాల్వంచ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అభివృద్ధికి అడ్డు తగులుతున్నడని, అధికారులను ఇబ్బంది పెట్టడం వలన వారు తమ ఉద్యోగాలు. విధులు సక్రమంగా చేసుకోకుండా వారిని వేదించడం వలన నియోజకవర్గంలోని ఎందరో అధికారులు తమ విధులకు లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నారన్నారు. ముందు నివు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు మేనిఫెస్టో విడుదల చేసి తన సొంత నిధులతో చేస్తానన్న అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేయవు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా అభివృద్ధి చేస్తే దాన్ని అడ్డుకుంటావు అన్నారు.ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదనీ, నీవు ఎక్కడికి వెళ్తే అక్కడ నిలదీస్తాం, అడ్డుకుంటాం అన్నారు.ఎన్నికల వరకే పార్టీలు. తర్వాత అధికారంలో ఉన్న పార్టీతో కలిసి అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప అడ్డుకోవడంలో కాదన్నారు. సమగ్ర సర్వేలో అందరూ తమ వివరాలు తెలియజేసి ప్రభుత్వ పథకాలను అందుకోవాలనీ, కొందరు లేనిపోని అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దీన్ని గ్రామాల్లో అందరికీ తెలియజేసి సమగ్ర సర్వేను విజయవంతం చేయాలన్నారు. సర్వేలో వివరాలను తెలియపరిస్తేనే ప్రభుత్వం నుండి వచ్చే పతకాలను పొందవచ్చున్నారు. దీని ద్వారా కులగలను కూడా జరిగి కులాలవారీగా అందరికి సమన్యాయం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.