నవతెలంగాణ – పెద్దవంగర
పదవి కాలం పూర్తి చేసుకున్న పెద్దవంగర ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి బుధవారం తొర్రూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారంలో కృషి చేసే నాయకులు ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర సబిత వెంకన్న, మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, సీనియర్ నాయకులు జాటోత్ నెహ్రు నాయక్, వైస్ ఎంపీపీ బొమ్మెరబోయిన కల్పన రాజు యాదవ్, ఎంపీటీసీ సభ్యులు బానోత్ రవీందర్ నాయక్, బానోత్ విజయ సోమన్న, మెట్టు సౌజన్య నగేష్, ఈరెంటి అనురాధ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.