– కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించండి
నవతెలంగాణ మద్నూర్
తెలంగాణ రాష్ట్రంలోని జుక్కల్ నియోజకవర్గానికి సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర దేగ్లూర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు శనివారం రాత్రి దేగ్లూర్ పట్టణంలో చేపట్టిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు విన్నవిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండలానికి చెందిన ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి పటేల్, ధరాస్ సాయిలు, హనుమాన్ స్వామి, రామ్ పటేల్, అమూల్, జావిద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.