మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపి అభ్యర్థుల తరఫున ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం వర్ధ ఎమ్మెల్యే అభ్యర్థి పంకజ్ బోయర పట్టణంలో ఆయన ప్రచారం నిర్వహించి బిజెపి పార్టీని ఆదరించారు కోరారు. మహారాష్ట్రలో మరోసారి బిజెపి అధికారంలో రావడం ఖాయం అన్నారు. ప్రజల నుంచి బిజెపి కూటమికి విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కూటమి మోసాలను నమ్మకండని పేర్కొన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు ఉన్నారు.