డిఫెన్స్ అకాడమీ గ్రౌండ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ -భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి నాలుగో వార్డులో మోత్కూర్ కు వెళ్లే రోడ్డు పక్కన ఎఎన్ డిఫెన్స్ అకాడమీ గ్రౌండ్ నీ స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత చదువు అయిపోగానే అదేవిధంగా చదువుతూనే దేశ రక్షణ కోసం ఈ యొక్క ట్రైనింగ్ ను తీసుకోవడం శుభ పరిణామం అనీ చెడు వ్యసనాలకు, అలవాటు పడకుండా ఇలాంటి శిక్షణ ఏర్పాటు చేసిన అన్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులు మొగిలిపాక అశోక్ కుమార్, నవీన్ కుమార్  ను అభినందించడం జరిగింది….. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య , భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల, వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఈరపాక నరసింహ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తంగళ్ళపల్లి రవికుమార్, భువనగిరి మండల సర్పంచులు ఎదునూరి ప్రేమలత మల్లేశం, ఎల్లంల శాలిని జంగయ్య, కాశపాక అరుణ నరేష్, చిక్కుల వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి , కూర వెంకటేష్, రాయగిరి మాజీ వార్డ్ మెంబర్ పల్లర్ల యాదగిరి, భువనగిరి మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుమైలారం వెంకటేష్, మండల మండల కార్యదర్శి బొల్లెపల్లి అశోక్, ఎడ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
పవన్ మోటార్స్ షోరూం ను ప్రారంభించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భువనగిరి బైపాస్ రోడ్డు లో ఏర్పాటు చేసిన పవన్ మోటార్స్ మారుతీ షోరూం ను భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తు యువత వాణిజ్య రంగం లో ముందుకు రావాలని తెలిపారు. ఈ సందర్బంగా భువనగిరి ప్రజలు కు మారుతీ షోరూం అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. భువనగిరి ప్రజలు పరోక్షంగా ఉద్యోగం లో వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో పవన్ చంద్ర రెడ్డి పాల్గొన్నారు.