నగరపాలక సంస్థ 5వ జోన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు అర్సపల్లి లో నగర పాలక సంస్థ 5వ జోన్ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. సులభతరమైన పాలన కోసం జోన్ కార్యాలయాలు. జోన్ కార్యాలయాలలలో  అధికారులు, కార్పొరేటర్ లు ప్రజలకు అందుబాటులో ఉంటారు. అధికారులు, కార్పొరేటర్ లు జోన్ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాను.ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ ,డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, సిర్ప రాజు, కార్పొరేటర్లు, నాయకులు అధికారులు పాల్గొన్నారు.