
మండలంలోని లాడేగాం గ్రామములో నతనంగా నిర్మించిన గ్రామ పంచాయతి భవనాన్ని స్థానిక ఎమ్మెలే లక్ష్మీకాంతారావ్ తోట సోమవారం నాడు ప్రారంబించారు. ఈ సంధర్బంగా గ్రామములో సర్పంచ్ అశ్వీని రాజశేఖర్ పటేల్ అద్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెుదటగా జాతీయ ఉపాదీ హమీ పథకంలో ఇరువై లక్షల రూపాయల నిధులతో నిర్మాణం పూర్తీ చేసుకున్న జీపీ భవనాాన్ని స్థానిక సర్పంచ్ అశ్వీని రాజశేఖర్ పటేల్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రాబించారు. జుక్కల్ ఎమ్మెలే లక్ష్మీకాంతారావ్ మాట్లాడుతు గ్రామాల ఆభివృద్దికి గ్రామపమచాయతి భవనం ఒక కోలమానాంగా ఉంటుందని , అందరి సహయ సహకారాలతో కలిసి గ్రామాల ఆభివృద్దిలో ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. రోడు పెండింగ్ లో ఉందని , అద్వానంగా ఏర్పడిందని తప్పక త్వరలో పనులను ప్రారంబించి తారు రోడు సౌకర్యం కల్పిస్తానని , సమస్యలుంటే తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని పేర్కోన్నారు. అదేవిధంగా గ్రామయువకులు ఎమ్మెలే కు రోజు వేయాలని వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశ్వీని పటేల్, ఉప సర్పంచ్, ఎంపిటిసి విజయ, ఎంపిడివో నరేష్, ఎంపివో యాదగిరి, పీఆర్ఏఈ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు , వివిధ గ్రామాల నుండి అన్ని పార్టీటీల సర్పంచులు, గ్రామపెద్దలు తదితరులు పాల్గోన్నారు.