
ఇటీవల అక్కలదేవిగూడెం గ్రామంలో రోడ్డు ప్రమాదం లో మరణించిన పుట్ట సైదులు కుటుంబ సభ్యులను గురువారం సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. అదేవిధంగా వట్టి ఖమ్మం పహాడ్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రౌతు రాఘవరావు ఇటీవల మరణించడం జరిగింది. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారి వెంట చివ్వెంల మండల బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు,వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్ రెడ్డి , మాజీ ఎంపీపీ రౌతు నరసింహ రావు , మిర్యాల గోవింద రెడ్డి, ధరావత్ బాబు నాయక్, పుట్ట గురువేందర్, అనిల్,మండవ మధు,పబ్బు సైదులు, పుట్ట వెంకటేశ్వర్లు, లోడే వెంకన్న, చంద్రయ్య, సతీష్, బీ ఆర్ ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.