– మండల సర్వసభ్య సమావేశంలో సమస్యల వెల్లువ
– పలు శాఖల అధికారుల నిర్లక్ష్యంపై సర్పంచుల ఆవేదన
– కరెంటు బిల్లులపై సర్పంచ్, ఎంపీటీసీలపై కేసులు ఏంటనీ మండిపాటు
– సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ
నవతెలంగాణ-తలకొండపల్లి
అధికారులు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండి సమన్వయంగా పనిచేయాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సూచించారు. మంగళవారం తలకొం డపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యా లయంలో ఎంపీపీ నిర్మల శ్రీశైలంగౌడ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావే శానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, జిల్లా కోఆప్షన్ ముజఫర్ రెహమాన్, ఆమనగలు మార్కెట్ చైర్మన్ నా లాపురం శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే శాఖల వారిగా అధికారులు ప్రస్తావించగా గ్రామపంచాయ తీల నిర్వహణలో భాగంగా విద్యుత్ మీటర్లు ఉన్న సకాలంలో బిల్లులు చెల్లించిన 20 ఏండ్ల క్రితం ఉన్న బిల్లుపై సర్పంచ్‌పై కేసులు నమోదు చేయటం ఎంత వరకు సమంజసం అని చంద్రధన సర్పంచ్ బక్కీ కు మార్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపూర్, మాదాయపల్లి గ్రామాల్లో శుద్ధ తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేసి మీటర్లు బిగించి విద్యుత్ బిల్లులు చెల్లి స్తున్నప్పటికీ వెంకటాపూర్‌లో సర్పంచ్ రమేష్ యాద వ్‌పై, మాదాయపల్లిలో వెల్జల్ ఎంపీటీసీ అంబాజీపై విద్యుత్ అధికారులు కేసులు నమోదు చేయటం ఏం టనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి విద్యుత్ అధికారు లు బాధ్యత వహించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కేశంపేట మండలంలో 24 గంటలు కరెంటు ఉన్నప్పటికీ, తలకొండపల్లి మం డలంలో ఎనిమిది గంటల కరెంటు సరఫరా కావడం ఏంటనీ సింగల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి ప్రశ్నిం చారు. విద్యుత్ సిబ్బంది రైతుల నుంచి ఎక్కువ డబ్బు లు వసూలు చేస్తూ డీడీలు కట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎంపీపీ నిర్మల శ్రీశైలంగౌడ్ నిలదీశారు. రైతులకు అన్యాయం చేస్తే చట్ట ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు. రెండో విడత గొర్రెల పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందని సర్పంచ్ రమేష్‌యాదవ్ ప్రస్తావించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వెలిజాల నుంచి గొర్రెల పంపిణీ కార్య క్రమం చేస్తామన్నారు. ప్రభుత్వం చేసిన రుణమాఫీపై రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని వారికి అర్థమయ్యేలా ఎంతమందికి రుణమాఫీ వర్తిస్తుందో గ్రామపంచాయతీల వద్ద సమాచారం అందించాలని వ్యవసాయ అధికారులకు సర్పంచ్లు, ఎంపీటీసీలు సూ చించారు. వైద్యశాఖ, విద్యాశాఖలో ఎవరిని కూడా ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై పంపిం చొద్దని తీర్మానం చేశారు. తలకొండపల్లి ప్రాథమిక ఆస్పత్రి శిథిలావస్థకు చేరిందని వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎంపీపీ నిర్మల శ్రీశైలంగౌడ్‌తో పాటు పలువురు సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే స్పందిస్తూ తప్పకుండా మరమ్మతులుచేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ కల్వకుర్తి నియోజ కవర్గ అభివృద్ధే తన లక్ష్యం అన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలోని ఆరు, ఏడు సర్వే నెంబర్లలో గల భూమిని ప్లాట్లుగా కేటాయించి 280 మంది కుటుంబ లకు భూమి పట్టాలు పంపిణీ చేసి గృహాలక్ష్మి పథకం అమలయ్యేట్టు చూడాలని ఎమ్మెల్యేను కోరారు. ఖానాపూర్ శివార్‌లో గల భూమిని హైదరాబాద్ ముస్లింల కోసం కేటాయించిన గ్రేవ్ యార్డును ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, హైకోర్టులో స్టే విధించినట్టు గుర్తు చేశారు. గట్టు ఇప్పలపల్లి గ్రామస్తులు తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని ప్లకార్డులతో మండల సమావేశంలో నిరసన వ్యక్తం చేయగా జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మల శ్రీశైలంగౌడ్ స్పందిస్తూ తలకొండపల్లి మండలంలో గట్టిప్పలపల్లితో పాటు వెల్జాల్ గ్రామాల ను మండలాలుగా ప్రకటించాలని తీర్మానం చేశారు. అదేవిధంగా మండలంలోని రామకృష్ణాపురం, సంగాయపల్లి, కర్కాస్తండాలను గ్రామపంచాయతీలు గా ప్రకటించాలని తీర్మానం చేశారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ అధికారులంతా అభివృ ద్ధిలో ప్రజాప్రతినిధులకు నిత్యం అందుబాటు లో ఉండి సహకరించాలని సూచించారు. సమస్యలు త మ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి తహ సీల్దార్ సంతోష్, ఎంపీఓ రఘు, ఏవో రాజు, ఎంఈఓ సర్దార్ నాయక్, సీడీపీఓ సగుబారు, ఏఈలు కటారియా, విద్యాసాగర్, రాజశేఖర్, పశువద్యాధికారి రాజశేఖర్, డాక్టర్ కల్పన, ఏపీఎం శ్రీదేవి, సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.