రైతు సంక్షేమానికి మార్కెట్ పాలక మండలి కృషి చేయాలి: ఎమ్మెల్యే జైవీర్రెడ్డి

నవతెలంగాణ – హలియా ;రైతు సంక్షేమానికి, గిట్టుబాటు అందించేందుకు మార్కెట్ పాలక మండలి కృషి చేయాలని నాగార్జునసాగర్  నియోజకవర్గ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు. సోమవారం హాలియా మార్కెట్ యార్డులో నిర్వహించిన మొట్టమొదటి పాలక మండలి సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ మార్కెట్ అభివృద్ధికి నావంతుగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రైతులు పం డించిన దాన్యం, అపరాలు. పత్తి తదితర పంటలకు ప్రభుత్వం అందించే మద్దతు ధర వారికి అందించేందుకు పాటుపడాలన్నారు. ఈసందర్భంగా 5 కోట్ల రూపాయలతో మార్కెట్ యార్డులో సీసీ డ్రైనేజీలు, అదనపు మార్కెట్ గోదాంలు, పెద్దవూర సబ్యార్లో కవ ర్షల్ కాంప్లెక్స్ ఏర్పాటు, మట్టిని నింపడం, తిరుమలగిరి సబ్యార్లో వేబ్రిడ్జి ఏర్పాటుపై చర్చించి పాలక మండలి ఆమోదించారు. అదే విధంగా కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, తెట్టెకుంట గోదాం వరకు రోడ్డు ఏర్పాటు చేయ డానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జైవీర్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ తుమ్మలపలి. చంద్రశేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్, మున్సిపాల్ చైర్పర్సన్ యడవల్లి అనుపమనరేందర్రెడ్డి, తహసీల్దార్ రఘు, నె క్రటరీ వెంకటరెడ్డి, డైరెక్టర్లు ఈడయ్య గౌస్, రఘు, మంగమ్మ, రాము, శంకర్, పాండునాయక్. లక్ష్మయ్య, సిబ్బంది, సైదులు, బలీల్, రామాంజి తదితరులు పాల్గొన్నారు.