నవతెలంగాణ-దమ్మపేట
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండలంలోని గండుగులపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కూడా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పలు సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను జారే స్వీకరించారు. సత్వరమే సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడుతూ త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు పలు అనారోగ్య సమస్యలు, పిల్లల చదువుల నిమిత్తం వచ్చిన వారందరి సమస్యలు ఓపికగా విని వాటి పరిష్కారం కోసం జారె కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.